Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 09:48 PM

వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

15-08-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం.. పాఠశాల అభివృద్ధికి దాతల చేయూత.

చిట్యాల, ఆగస్టు 15:

చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వై. జానకి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ పతాకానికి వందనం సమర్పించారు.అనంతరం విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు గ్రామ పెద్దలు, దాతల సహకారంతో ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. విద్యార్థులలో ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు దాతలు అందించిన సహకారం పాఠశాల వర్గాల్లో ప్రశంసలు అందుకుంది.

రూ.9 వేల ఆర్థిక సహాయం

తరగతుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కోసం నర్ర జనార్ధన్ రెడ్డి రూ.9,000 ఆర్థిక సహాయం అందించారు.

క్రీడా బహుమతులు అందజేత

క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్పంచ్ మేడి శ్రీలత ఆటల బహుమతులను సమకూర్చారు.

విద్యార్థులకు తినుబండారాలు

విద్యార్థులందరికీ చాక్లెట్లు, బిస్కెట్లు, అరటిపండ్లు పంపిణీ చేసేందుకు సి.ఐ. బుర్గు శ్రీనివాస్ రూ.5,000 అందించారు.

కార్పెట్ల కొనుగోలుకు విరాళం

పాఠశాల విద్యార్థుల అవసరాల కోసం కార్పెట్ల కొనుగోలుకు నర్ర భిక్షం రెడ్డి రూ.4,000 విరాళంగా అందించారు.

పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ప్రోత్సాహానికి దాతలు అందించిన సహకారం అభినందనీయమని ప్రధానోపాధ్యాయురాలు వై. జానకి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటూ దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News