Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 09:57 PM

నల్గొండలో మహిళా శక్తి పెట్రోల్ పంప్ ప్రారంభం..

15-08-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం..

సూపర్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి..

2028 నాటికి ఎస్ఎల్‌బీసీ పనులు పూర్తి చేస్తాం..

నల్గొండ : మహిళలు వివిధ వృత్తులు, వ్యాపారాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం నల్గొండ సమీపంలోని గంధంవారిగూడెంలో నీలగిరి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రూ.3.50 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ‘నీలగిరి మహిళా శక్తి పెట్రోల్ పంప్’ను మంత్రి ప్రారంభించారు. దీనితోపాటు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సూపర్‌ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... మహిళలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంక్ లింకేజీ, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సోలార్ యూనిట్లు, బస్సుల నిర్వహణ వంటి అనేక అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కేవలం చిన్న వ్యాపారాలకే పరిమితం కాకుండా రైస్ మిల్లులు, గోదాములు, పెట్రోల్ పంపుల నిర్వహణ ద్వారా మహిళలు సొంతకాళ్లపై నిలబడాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.

మౌలిక వసతుల కేంద్రంగా గంధంవారిగూడెం...

 పెట్రోల్ పంప్ పక్కనే సూపర్ మార్కెట్, కాఫీ షాప్, రెస్టారెంట్ ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, రూ.40 కోట్లతో నర్సింగ్ కళాశాల, మెడికల్ కళాశాలలు వస్తున్నందున వేలాది మంది విద్యార్థులకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. డిసెంబర్ 9 నాటికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జిల్లాలో మహిళల ఆర్థిక అభివృద్ధికి రూ.1,142 కోట్ల బ్యాంక్ రుణాలను అందించామని ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. 2028 నాటికి ఎస్ఎల్‌బీసీ (SLBC) సొరంగం పనులను పూర్తి చేసి నల్గొండ జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి ప్రకటించారు. నల్గొండ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 5 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములను, రైస్ మిల్లులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

రాష్ట్రంలోనే 3వ మహిళా శక్తి పంప్..

నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోనే ఇది 3వ మహిళా శక్తి పెట్రోల్ పంప్‌ అని తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో దశలవారీగా ఇలాంటి వ్యాపార అవకాశాలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతితోనే కుటుంబ సాధికారత సాధ్యమవుతుందని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) నిబంధనలకు అనుగుణంగా ఈ పెట్రోల్ పంప్‌ను మహిళలు లాభదాయకంగా నిర్వహించాలని సూచించారు. నల్గొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మహిళా సంఘాల కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, ఐవోసీఎల్ డీజీఎం, డీఆర్‌డీవో శేఖర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బనావత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నల్గొండలో మహిళా శక్తి పెట్రోల్ పంప్ ప్రారంభం..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News