Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

చండూరు పీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలి: అయితరాజు అభయేందర్

15-08-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) దుస్థితిపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. శనివారం బీఎస్పీ చండూరు మండల అధ్యక్షుడు కడారి సైదులు ఆధ్వర్యంలో నాయకులు ఆసుపత్రిని పరిశీలించారు.​ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ అయితరాజు అభయేందర్ మాట్లాడుతూ.. సుమారు 40 వేల జనాభా ఉన్న ప్రాంతానికి కేవలం ఆరు పడకలతో ఆసుపత్రి నడపడం దారుణమన్నారు. భవనం శిథిలావస్థకు చేరిందని, కిటికీల అద్దాలు, తలుపులు విరిగిపోయి రోగులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయని మండిపడ్డారు. అత్యవసర సమయంలో పేద ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తోందన్నారు.​స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. చండూరు పీహెచ్‌సీని తక్షణమే 100 పడకలకు పెంచి, అవసరమైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వైద్య పరికరాలను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, నియోజకవర్గ ఇంచార్జి బొట్ట శివ, చండూరు మున్సిపల్ అధ్యక్షురాలు పద్మ, అన్నపాక శంకర్, రుషిపాక మాణిక్యం, మర్రిగూడ మండల అధ్యక్షులు నాగిళ్ల మారయ్య, గట్టుప్పల్ మండల అధ్యక్షులు భరిగాలా వినోద్, నారాయణపురం మండల అధ్యక్షులు ఎర్రోళ్ల గిరి, మండల ఉపాధ్యక్షులు గొందిగళ్ల కృష్ణ, నాయకులు రాజు, శేఖర్, నవీన్, శంకర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చండూరు పీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలి: అయితరాజు అభయేందర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News