Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:32 PM

ప్రతిభకు ప్రోత్సాహం.. దేశభక్తికి నిదర్శనం

15-08-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిన్నకాపర్తి జెడ్‌పీహెచ్‌ఎస్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

చిట్యాల: మండలంలోని చిన్నకాపర్తి జెడ్‌పీహెచ్‌ఎస్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి పానుగోతు సైదా నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పానుగోతు సైదా నాయక్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ‘దేశం నాకేమిచ్చింది?’ అని కాకుండా.. ‘దేశానికి నేను ఏమి చేయగలను?’ అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

ఎస్‌ఎస్‌సీ టాపర్లకు ఘన సన్మానం.

ఎస్‌ఎస్‌సీ–2026 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ప్రథమ స్థానంలో హెచ్. శ్రీవిద్య, ద్వితీయ స్థానంలో ఎం. వైష్ణవి, తృతీయ స్థానంలో కె. అలేఖ్య నిలిచారు.

విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ బందెల అంజయ్య ప్రథమ స్థానానికి రూ.5 వేలు, ద్వితీయ స్థానానికి రూ.3 వేలు, తృతీయ స్థానానికి రూ.2 వేల నగదు బహుమతులు అందజేశారు. మొగిలిదొరి గ్రామానికి చెందిన శ్రీ వంగల అంజిరెడ్డి ప్రథమ స్థానానికి రూ.3 వేలు, ద్వితీయ స్థానానికి రూ.2 వేలు, తృతీయ స్థానానికి రూ.వెయ్యి చొప్పున నగదు బహుమతులు అందించారు.

చిన్నకాపర్తికి చెందిన తిరుమాన్ దాస్ శ్రీనివాస్–ప్రతిభ దంపతులు ఎస్‌ఎస్‌సీలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను మెమోంటోలు, శాలువాలతో సన్మానించారు.

క్రీడా విజేతలకు బహుమతులు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో విజేతలకు చిన్నకాపర్తికి చెందిన శ్రీ పాతిమా–జహంగీర్ బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ లావణ్య రఘు, వార్డు సభ్యులు నర్సింహా, మధు, దయాకర్, రాజు, గ్రామ పెద్దలు సత్యనారాయణ, ప్రశాంత్, స్వామి, దశరథ, భీమయ్య, చెన్నారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతిభకు ప్రోత్సాహం.. దేశభక్తికి నిదర్శనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News