Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 08:53 PM

స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ఆచరించాలి

స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ఆచరించాలి

స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ఆచరించాలి
15-08-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తెలంగాణ మోడల్‌ స్కూల్‌, మట్టంపల్లిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ బి. శంకర్‌ నాయక్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌, భగత్‌సింగ్‌, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ తదితర స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. వారు పాటించిన సత్యం, అహింస, సమానత్వం, ఐక్యత, దేశభక్తి వంటి విలువలను జీవితంలో ఆచరించడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు.విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవడంతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలను గౌరవించాలని సూచించారు. పాఠశాల ఆస్తులను కాపాడటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇతరులకు సహాయం చేయడం వంటి మంచి అలవాట్లను పెంపొందించుకోవాలన్నారు. రాజ్యాంగ విలువలైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని గౌరవిస్తూ కుల, మత, భాష, ప్రాంత భేదాలకు తావివ్వకుండా అందరినీ గౌరవించాలని పిలుపునిచ్చారు. ప్రకృతి, చెట్లు, జంతువులు, నీటి వనరులను సంరక్షించాలని, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఇతరుల విజయాలను అభినందిస్తూ, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలని, కోపం కంటే సహనాన్ని, ద్వేషం కంటే మానవత్వాన్ని ఎంచుకోవాలని అన్నారు. ‘నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు. విద్యతో జ్ఞానంతో పాటు మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణ, మానవత్వం పెంపొందించుకోవాలి. విజయవంతమైన వ్యక్తులుగా మాత్రమే కాకుండా మంచి మనుషులుగా, బాధ్యతాయుతమైన భారతీయులుగా ఎదగాలి’ అని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య సమరయోధులు అందించిన స్వేచ్ఛను కాపాడుతూ భవిష్యత్‌ తరాలకు మెరుగైన భారతదేశాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ సైదులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్‌ నిర్మల, విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా ముగిసింది.

Sthanikam

స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ఆచరించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News