Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:34 PM

శివసాయి వెంచర్‌లో 10 శాతం భూమిని పరిరక్షించాలి

12-08-2026 330 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మున్సిపల్ కమిషనర్‌కు యువ శక్తి యువజన సంఘం వినతి.

చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు పాత శివనేని గూడెం రోడ్డులో ఎల్లమ్మ తల్లి దేవాలయం వెనుక ఉన్న శివసాయి వెంచర్‌లో 10 శాతం భూమిని పరిరక్షించి, వార్డు అభివృద్ధికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ యువ శక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గురు లింగంను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చింతపల్లి ప్రవీణ్, మద్ది మధు మాట్లాడుతూ.. వెంచర్‌లో నిబంధనల ప్రకారం 10 శాతం భూమి ఉందా? ఉంటే అది ఎక్కడ ఉందో స్పష్టం చేయాలని కోరారు. 10 శాతం భూమి ఉన్నట్లయితే దాని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, వార్డు అభివృద్ధి అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు.వెంచర్‌లోని 10 శాతం భూమిపై స్థానిక ప్రజల్లో పలు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారులు సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని వారు కోరారు. ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు బొడ్డుపల్లి శ్రీను, బొడ్డుపల్లి ఉపేందర్, సిలివేరు రిశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శివసాయి వెంచర్‌లో 10 శాతం భూమిని పరిరక్షించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News