Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:59 PM

ఏసీపీ కార్యాలయంలో కలకలం.. కానిస్టేబుల్ మృతి

12-08-2026 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్: ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. ఈ-కాప్స్ విధుల్లో భాగంగా కార్యాలయానికి అటాచ్ అయిన యువ కానిస్టేబుల్ జె. సాయికుమార్ (13128) బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు.

పోలీసుల వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కార్యాలయంలోని రెస్ట్రూమ్‌లో సాయికుమార్‌ను అపస్మారక స్థితిలో గుర్తించిన తోటి సిబ్బంది వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

2024 బ్యాచ్ కానిస్టేబుల్.

సాయికుమార్ 2024 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌గా పోలీసులు గుర్తించారు. కర్మన్‌ఘాట్‌లో స్నేహితులతో కలిసి అద్దె గదిలో ఉంటున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.కానిస్టేబుల్ మృతికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు

Sthanikam

ఏసీపీ కార్యాలయంలో కలకలం.. కానిస్టేబుల్ మృతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News