Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

​రూ.20 వేల దందాపై ఉన్న శ్రద్ధ.. విద్యార్థుల భద్రతపై ఏదీ?

11-08-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి: ఎస్ఎఫ్ఐ

అగ్నిమాపక, ఇంటర్ విద్యాశాఖ తనిఖీలకు డిమాండ్

పుస్తకాలు, యూనిఫాంల పేరుతో రూ.20 వేల వరకు వసూలు చేస్తున్న శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల యాజమాన్యం.. విద్యార్థుల ప్రాణ భద్రతను మాత్రం గాలికొదిలేసిందని ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

​కళాశాలలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు నిబంధనల ప్రకారం లేవని, ప్రమాదం జరిగితే సురక్షితంగా బయటపడేందుకు అత్యవసర (ఎగ్జిట్) మార్గాలు కూడా అందుబాటులో లేవని ఆరోపించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో అగ్నిప్రమాదం సంభవిస్తే పైఅంతస్తుల్లో ఉండే వందలాది మంది విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ​కార్యాలయాలకే పరిమితం కాకుండా అగ్నిమాపక, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు కళాశాలను నేరుగా తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలకు మంజూరైన సీట్లు, చదువుతున్న విద్యార్థుల సంఖ్య, బోధనా సిబ్బంది అర్హతలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అరవింద్, వంశీ, నితిన్, లోకేష్, తేజ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

​రూ.20 వేల దందాపై ఉన్న శ్రద్ధ.. విద్యార్థుల భద్రతపై ఏదీ?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News