Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:33 PM

చిట్యాల నుంచి మలేషియాకు.. సంగీత క్రీడా ప్రస్థానం

11-08-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మలేషియాలో జరిగే సౌత్‌ ఈస్ట్‌ ఆసియా లాక్రోస్‌ కప్‌–2026లో బరిలోకి..

ప్రభుత్వం సాయం చేయాలని చిట్యాల వాసుల విజ్ఞప్తి.

చిట్యాల: చిన్ననాటి నుంచే క్రీడలపై ఉన్న ఆసక్తితో లాక్రోస్‌ క్రీడలో సత్తా చాటి జాతీయ స్థాయికి ఎదిగింది చిట్యాల మున్సిపాలిటీకి చెందిన చిర్రబోయిన సంగీత. అంతర్జాతీయ వేదికపై భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు ఆమె సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరగనున్న సౌత్‌ ఈస్ట్‌ ఆసియా లాక్రోస్‌ కప్‌–2026 పోటీల్లో పాల్గొనే భారత లాక్రోస్‌ క్రీడా జట్టుకు ఆమె ఎంపికైంది. ఈ మేరకు లాక్రోస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు (వెంకటాపురం)కు చెందిన చిర్రబోయిన నర్సింహ–మహేశ్వరి దంపతుల కుమార్తె సంగీత. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు చిట్యాలలోని లోయోలా స్కూల్‌లో చదువుకుంది. అనంతరం ఐదో తరగతిలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని బీసీ గురుకులంలో చేరింది. ప్రస్తుతం ఆమె అక్కడే ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు క్రీడలపై ఉన్న మక్కువతో లాక్రోస్‌ ఆటపై ప్రత్యేక దృష్టి సారించింది. క్రమం తప్పకుండా సాధన చేస్తూ రాష్ట్ర, దక్షిణ భారత స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో విజయాలను అందుకుంది.

స్వర్ణ పతకాలతో సత్తా..

జూలై చివరి వారంలో జరిగిన దక్షిణ భారతదేశ మండల లాక్రోస్‌ జాతీయ ఛాంపియన్‌షిప్‌–2026లో తెలంగాణ స్టేట్‌ సీనియర్‌ గర్ల్స్‌ లాక్రోస్‌ జట్టుకు సంగీత ప్రాతినిధ్యం వహించి విశేష ప్రతిభ కనబరిచింది. ఆమె ఆటతీరుతో తెలంగాణ జట్టుకు స్వర్ణ పతకం వరించింది. అలాగే గతంలో ఏపీలోని కర్నూలు, చెన్నైలో జరిగిన సౌత్‌ జోన్‌ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని బంగారు పతకాలను సాధించిన జట్టులోనూ ఆమె కీలక సభ్యురాలిగా ఉంది.

వరుస పోటీల్లో ఆమె కనబరిచిన ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే భారత లాక్రోస్‌ జట్టులో చోటు దక్కించుకుని అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది.

అభినందనల వెల్లువ..

సంగీతను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు, కమిషనర్‌ బాల మాయాదేవి తదితరులు అభినందించారు.

సంగీత నిరుపేద కుటుంబానికి చెందినది కావడంతో దాతలు, ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనందిస్తే దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చే అవకాశం ఉందని స్థానికులు, క్రీడాభిమానులు కోరుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సహకరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Sthanikam

చిట్యాల నుంచి మలేషియాకు.. సంగీత క్రీడా ప్రస్థానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News