Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:58 PM

సీఎం పర్యటన వేళ డీవైఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ నేతల అరెస్ట్

10-08-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అక్రమ అరెస్టులను ఖండించిన విద్యార్థి, యువజన సంఘాలు

ఉద్యోగాలు భర్తీ చేయాలి.. స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలి

నల్గొండ, ఆగస్టు 10:

ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పర్యటన సందర్భంగా డీవైఎఫ్‌ఐ నల్గొండ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు గాదేపాక సాయి తేజలను నల్గొండ టూటౌన్ పోలీసులు అరెస్టు చేయడాన్ని సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే, నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. విద్యార్థులు, యువత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన తమను పోలీసులు అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.

స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలను విడుదల చేసి విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణచివేయడం సరికాదని, అక్రమ అరెస్టులకు స్వస్తి పలికి విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు.

Sthanikam

సీఎం పర్యటన వేళ డీవైఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ నేతల అరెస్ట్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News