Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:14 PM

శివనేనిగూడెం–చిట్యాల మార్గంలో విలువైన విద్యా ధృవపత్రాల బ్యాగ్ మిస్సింగ్

03-08-2026 264 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఎవరికైనా దొరికితే తిరిగి అందించాలని యువకుడి విజ్ఞప్తి.

చిట్యాల:

హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన భీమవరపు వెంకటేష్‌కు చెందిన విలువైన విద్యా ధృవపత్రాలు ఉన్న బ్యాగ్ శివనేనిగూడెం–చిట్యాల మార్గంలో పోగొట్టుకోవడం జరిగింది. తన మిత్రుడిని కలిసేందుకు శివనేనిగూడెం గ్రామానికి వెళ్లిన వెంకటేష్, తిరుగు ప్రయాణంలో శివనేనిగూడెం నుంచి చిట్యాల బస్టాప్‌కు వస్తున్న సమయంలో బ్యాగ్ కనిపించకుండా పోయినట్లు తెలిపారు.పోగొట్టుకున్న బ్యాగ్‌లో ఇంటర్మీడియట్ మెమో, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ), ఆధార్ కార్డు, ఇతర ముఖ్యమైన విద్యా సంబంధిత పత్రాలు ఉన్నాయని చెప్పారు. ఈ ధృవపత్రాలు తన ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు అత్యంత కీలకమైనవని ఆవేదన వ్యక్తం చేశారు.

బ్యాగ్ లేదా అందులోని పత్రాలు ఎవరికైనా దొరికితే మానవత్వంతో తిరిగి అందించాలని, లేదా సమాచారం ఇవ్వాలని వెంకటేష్ కోరారు. 9391308811 నంబర్‌కు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

"బ్యాగ్ లేదా అందులోని పత్రాలను తిరిగి అందించిన వారి సహకారాన్ని జీవితాంతం మరువను" అని వెంకటేష్ భావోద్వేగంగా తెలిపారు.

Sthanikam

శివనేనిగూడెం–చిట్యాల మార్గంలో విలువైన విద్యా ధృవపత్రాల బ్యాగ్ మిస్సింగ్

Article Image

ఎవరికైనా దొరికితే తిరిగి అందించాలని యువకుడి విజ్ఞప్తి.

చిట్యాల:

హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన భీమవరపు వెంకటేష్‌కు చెందిన విలువైన విద్యా ధృవపత్రాలు ఉన్న బ్యాగ్ శివనేనిగూడెం–చిట్యాల మార్గంలో పోగొట్టుకోవడం జరిగింది. తన మిత్రుడిని కలిసేందుకు శివనేనిగూడెం గ్రామానికి వెళ్లిన వెంకటేష్, తిరుగు ప్రయాణంలో శివనేనిగూడెం నుంచి చిట్యాల బస్టాప్‌కు వస్తున్న సమయంలో బ్యాగ్ కనిపించకుండా పోయినట్లు తెలిపారు.పోగొట్టుకున్న బ్యాగ్‌లో ఇంటర్మీడియట్ మెమో, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ), ఆధార్ కార్డు, ఇతర ముఖ్యమైన విద్యా సంబంధిత పత్రాలు ఉన్నాయని చెప్పారు. ఈ ధృవపత్రాలు తన ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు అత్యంత కీలకమైనవని ఆవేదన వ్యక్తం చేశారు.

బ్యాగ్ లేదా అందులోని పత్రాలు ఎవరికైనా దొరికితే మానవత్వంతో తిరిగి అందించాలని, లేదా సమాచారం ఇవ్వాలని వెంకటేష్ కోరారు. 9391308811 నంబర్‌కు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

"బ్యాగ్ లేదా అందులోని పత్రాలను తిరిగి అందించిన వారి సహకారాన్ని జీవితాంతం మరువను" అని వెంకటేష్ భావోద్వేగంగా తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News