Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

చిన్నతనం నుంచే భక్తి బాట.. 17వ సారి అయ్యప్ప మాలధారణ పెద్దగోని రమేష్ గౌడ్

Updated : 24 Nov 2026 03:47 IST
As Preferred Source 1 min read
చిన్నతనం నుంచే భక్తి బాట.. 17వ సారి అయ్యప్ప మాలధారణ పెద్దగోని రమేష్ గౌడ్

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

చిన్నతనం నుంచే అయ్యప్ప స్వామిపై అపారమైన భక్తిశ్రద్ధలు పెంచుకున్న చౌటుప్పల్ పట్టణానికి చెందిన పెద్దగోని రమేష్ గౌడ్ 17వ సారి అయ్యప్ప మాలధారణ చేశారు. పట్టణ కేంద్రంలోని శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప స్వామి దేవాలయంలో గురుస్వామి సమక్షంలో ఆయన భక్తిశ్రద్ధలతో మాల ధరించి, దీక్షను ప్రారంభించారు. ఏటా కఠిన నియమ నిష్ఠలతో మండల దీక్షను చేపడుతూ ఆధ్యాత్మిక భావాన్ని చాటుతున్నారు.​ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ దైవభక్తిని అలవర్చుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, నియమ నిష్ఠలతో కూడిన ఆధ్యాత్మిక జీవనం మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని, సదాలోచనలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. 17వ సారి దీక్ష చేపట్టిన రమేష్ గౌడ్‌ను ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు.

Sthanikam

చిన్నతనం నుంచే భక్తి బాట.. 17వ సారి అయ్యప్ప మాలధారణ పెద్దగోని రమేష్ గౌడ్

Article Image

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

చిన్నతనం నుంచే అయ్యప్ప స్వామిపై అపారమైన భక్తిశ్రద్ధలు పెంచుకున్న చౌటుప్పల్ పట్టణానికి చెందిన పెద్దగోని రమేష్ గౌడ్ 17వ సారి అయ్యప్ప మాలధారణ చేశారు. పట్టణ కేంద్రంలోని శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప స్వామి దేవాలయంలో గురుస్వామి సమక్షంలో ఆయన భక్తిశ్రద్ధలతో మాల ధరించి, దీక్షను ప్రారంభించారు. ఏటా కఠిన నియమ నిష్ఠలతో మండల దీక్షను చేపడుతూ ఆధ్యాత్మిక భావాన్ని చాటుతున్నారు.​ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ దైవభక్తిని అలవర్చుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, నియమ నిష్ఠలతో కూడిన ఆధ్యాత్మిక జీవనం మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని, సదాలోచనలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. 17వ సారి దీక్ష చేపట్టిన రమేష్ గౌడ్‌ను ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి