మునగాల మండల పరిధిలోని బరాకత్ గూడెం గ్రామంలో 31 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.10,56,500 విలువైన చెక్కులను సోమవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందిన వారు ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
పేదల వైద్యానికి సీఎం సహాయ నిధి అండ: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి