ఎన్‌ఐఎంజెడ్ (NIMZ)కు సంబంధించిన ప్రభుత్వ భూముల్లో ఎర్రరాయిని అక్రమంగా తవ్వుతున్నారంటూ సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్రమ తవ్వకాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 23-11-2026న జహీరాబాద్ డీఎస్పీ ఆధ్వర్యంలో జహీరాబాద్ రూరల్ సీఐతో పాటు హత్నూర, ఝరాసంగం, రాయికోడ్ ఎస్సైల బృందాలు గణేష్‌పూర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో, ఎన్‌ఐఎంజెడ్ ప్రభుత్వ భూముల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి.ఈ తనిఖీల్లో మూడు కటింగ్ యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా ఎర్రరాయి తవ్వకాలు చేపట్టడం చట్టరీత్యా నేరమని, ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని,అక్రమ తవ్వకాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, ఈ విషయంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
గణేష్‌పూర్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు.. మూడు యంత్రాలు పట్టివేత
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి