నల్గొండ: చిట్యాల పట్టణ శివారులోని ఐడీఎల్ కంపెనీ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయింది.
సమాచారం అందుకున్న స్థానికులు, సంబంధిత సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి