నకిరేకల్‌లో విషాదం.. బాబాసాహెబ్‌గూడెంలో ఘటన.
నకిరేకల్: చదువు ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని బాబాసాహెబ్‌గూడెంలో చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన భూపతి రాజేష్ హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. చదువు ఒత్తిడి కారణంగా మనస్తాపానికి గురైన రాజేష్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.విద్యార్థి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చేతికి అందివచ్చిన కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి