Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

పేదల పాలిట వరం సీఎం సహాయ నిధి

Updated : 18 Nov 2026 20:58 IST
As Preferred Source 1 min read
పేదల పాలిట వరం సీఎం సహాయ నిధి

​బాధితుడికి రూ.1.50 లక్షల ఎల్‌వోసీ అందజేసిన సర్పంచ్ జువ్వి నర్సింహా

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

నిరుపేదల వైద్య ఖర్చులకు సీఎం సహాయ నిధి ఒక వరంలాంటిదని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ అన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామానికి చెందిన కొంతం లక్ష్మారెడ్డికి మంజూరైన రూ.1.50 లక్షల విలువైన ఎల్‌వోసీ పత్రాన్ని బుధవారం ఆయన బాధితుడికి అందజేశారు.​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి కొంతకాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఆయన అనారోగ్య పరిస్థితిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1.50 లక్షల ఎల్‌వోసీ మంజూరు చేయించారని పేర్కొన్నారు. బాధితుడికి అండగా నిలిచిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.​ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ బత్తుల శ్రీహరి, వార్డు సభ్యుడు రాచకొండ భార్గవ్, మాజీ సర్పంచ్ బద్రి లింగయ్య, మాజీ ఉప సర్పంచ్ కొంతం బుచ్చిరెడ్డి, నాయకులు ఊదరి శంకర్, ఐతరాజు లింగస్వామి, చెన్నోజు విజయ్‌చారి, గ్రామస్థులు గుర్రం రవీందర్, దాసరి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదల పాలిట వరం సీఎం సహాయ నిధి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి