Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో నడవాలి

Updated : 18 Nov 2026 20:57 IST
As Preferred Source 1 min read
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో నడవాలి

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ.

శివదీక్ష గురుస్వామి గోగులోతు శంకర్ నాయక్

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

ప్రతి ఒక్కరూ జీవితంలో ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని, ముఖ్యంగా నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ భక్తి మార్గంలో నడవాలని శివదీక్ష గురుస్వామి గోగులోతు శంకర్ నాయక్ అన్నారు.కార్తీక మాసంలో పరమశివునిపై అపారమైన భక్తితో శివదీక్ష స్వీకరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఆధ్యాత్మికత మనిషిలో క్రమశిక్షణ, మానసిక ప్రశాంతతతో పాటు సేవాభావాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. నేటి సమాజంలో యువత మంచి ఆలోచనలను అలవర్చుకుంటూ, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకుంటూ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అలవర్చుకోవాలని గోగులోతు శంకర్ నాయక్ పిలుపునిచ్చారు.

Sthanikam

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో నడవాలి

Article Image

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ.

శివదీక్ష గురుస్వామి గోగులోతు శంకర్ నాయక్

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

ప్రతి ఒక్కరూ జీవితంలో ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని, ముఖ్యంగా నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ భక్తి మార్గంలో నడవాలని శివదీక్ష గురుస్వామి గోగులోతు శంకర్ నాయక్ అన్నారు.కార్తీక మాసంలో పరమశివునిపై అపారమైన భక్తితో శివదీక్ష స్వీకరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఆధ్యాత్మికత మనిషిలో క్రమశిక్షణ, మానసిక ప్రశాంతతతో పాటు సేవాభావాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. నేటి సమాజంలో యువత మంచి ఆలోచనలను అలవర్చుకుంటూ, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకుంటూ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అలవర్చుకోవాలని గోగులోతు శంకర్ నాయక్ పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి