ప్రజలు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మునగాల ఎస్సై సంజీవరెడ్డి సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని తెలిపారు. ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ చదువు, మంచి లక్ష్యాలపై దృష్టి సారించాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని తెలిపారు. మహిళలు, విద్యార్థులు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని, ప్రజల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రజా భరోసా కార్యక్రమంలో భరోసా కల్పించారు.
చట్టాలపై అవగాహనతోనే నేరాలకు అడ్డుకట్ట
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి