Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ఈదులవాగు తండాలో నాటు సారాయి పట్టివేత

Updated : 18 Nov 2026 20:47 IST
As Preferred Source 1 min read
ఈదులవాగు తండాలో నాటు సారాయి పట్టివేత

మునగాల మండలంలోని ఈదులవాగు తండాలో నాటు సారాయి విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహించి ఐదు లీటర్ల నిషేధిత సారాయిని స్వాధీనం చేసుకున్నారు. నాటు సారాయి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మునగాల పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బానోత్ పద్మ భర్త బాలాజీ వద్ద ఐదు లీటర్ల నాటు సారాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మల్లు సంజీవరెడ్డి తెలిపారు. నిషేధిత సారాయి తయారీ, విక్రయాల వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలగడంతో పాటు కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా కొనసాగిస్తామని, చట్టవిరుద్ధంగా సారాయి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

Sthanikam

ఈదులవాగు తండాలో నాటు సారాయి పట్టివేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి