Sthanikam - Truth Matters
Logo

పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు దారుణ హత్య

Updated : 10 Nov 2026 14:08 IST
As Preferred Source 1 min read
పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు దారుణ హత్య

భర్తే గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.. నల్లగొండలో కలకలం.

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు దారుణ హత్యకు గురయ్యారు. నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న మెహబూబ్ బీని ఆమె భర్త సతీష్ గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.

మెహబూబ్ బీ, సతీష్ కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీస్ క్వార్టర్స్‌లోనే మహిళా హోంగార్డు హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.

Sthanikam

పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు దారుణ హత్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి