కోర్టు ఆదేశాల అమలులో జాప్యంపై కోర్టు ధిక్కరణ కేసు.. అప్పీల్‌కు నాలుగు వారాల గడువు.
హైదరాబాద్, నవంబర్
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి తెలంగాణ హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించినట్లు పేర్కొంటూ రూ.2 వేల జరిమానా కూడా విధించింది.
వివరాల్లోకి వెళ్తే.. 2025 ఆగస్టులో పలువురు బాధితులు తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సంబంధిత భూముల అంశంపై 60 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని ఆదేశించింది.
అయితే నిర్ణీత గడువు ముగిసినా కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో బాధితులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం కలెక్టర్‌కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
అయితే తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి