పేద,మధ్యతరగతి ప్రజలకు కంటి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కోదాడ పట్టణంలో ఈ నెల 10వ తేదీ మంగళవారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. 30వ వార్డు కౌన్సిలర్ కారింగుల ఉమా అంజన్ గౌడ్ ఆధ్వర్యంలో,ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రోత్సాహంతో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
కట్టకమ్మగూడెం రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిబిరం కొనసాగనుంది.ఇందులో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేయనున్నారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో కంటి వైద్యం చేయించుకోలేని పేదలు,వృద్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. కోదాడ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు శిబిరానికి హాజరై వైద్య సేవలు పొందాలని కారింగుల ఉమా అంజన్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి