మునగాల మండలంలోని రేపాల గ్రామంలో 108 అంబులెన్స్ సకాలంలో అందుబాటులో లేకపోవడంతో పొనుగోటి రామయ్య ఆదివారం మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. అత్యవసర సమయంలో అంబులెన్స్ ఆలస్యంగా రావడం, సాంకేతిక లోపాలు ప్రాణనష్టానికి కారణమయ్యాయని గ్రామ ఉపసర్పంచ్ తుమ్మ సతీష్ సోమవారం ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉంచడంతో పాటు, గ్రామానికి ప్రత్యేకంగా అంబులెన్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
రేపాలకు ప్రత్యేక అంబులెన్స్ కేటాయించాలి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి