విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం.. రోడ్డు పక్కనే ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్.
నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 6వ వార్డు వెంకటాపురంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కనే ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎలాంటి రక్షణ కంచె ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ కుక్క మృతి చెందింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపురంలో రహదారి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె లేకపోవడంతో మూగజీవాలు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కు గురైన కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కనీస భద్రతా చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కుక్క మృతితోనైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మనుషులు, ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి