నల్గొండ జిల్లా: నకిరేకల్ నియోజకవర్గంలోని అయిటిపాముల గ్రామ శివారులో చెరువు అన్నారం ఎక్స్‌రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెరువు అన్నారం నుంచి హైవేపైకి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NH-65పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి