Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు ఎమ్మెల్యే కీలక సూచనలు

Updated : 02 Nov 2026 18:38 IST
As Preferred Source 1 min read
ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు ఎమ్మెల్యే కీలక సూచనలు

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అధికారులకు సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. సదాశివపేట మండలం పెద్దాపూర్ రైతు వేదికలో నందికంది పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం సంగారెడ్డి మండలం నాగపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులందరికీ సమాన ప్రాధాన్యత కల్పించాలని, దళారులకు అవకాశం లేకుండా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరించాలని సూచించారు. సన్న ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్‌కు రూ.500 బోనస్ తప్పనిసరిగా అందించాలని, గత ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న బోనస్ బకాయిలను కూడా వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలు, పంట రుణాలు, ఎరువుల కొరత వంటి సమస్యలను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించాలని కోరినట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రవాణాలో ఎలాంటి జాప్యం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్న ఎమ్మెల్యే, రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధరతో పాటు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని కోరారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాముగోపాల్, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, చక్రపాణి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, సుధాకర్, లక్ష్మారెడ్డి, సర్పంచ్ అశోక్ గౌడ్, రాజు, మనీష్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు ఎమ్మెల్యే కీలక సూచనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి