భూసేకరణ చేసి కాలువలు నిర్మించాలి.. ఆర్డీఓకు రైతుల వినతి.
నల్గొండ: బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి అన్నేపర్తి గ్రామంలోని పడమటి, తూర్పు చెరువులకు నీరు అందించాలని గ్రామ రైతులు ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. అవసరమైన భూసేకరణ చేపట్టి కాలువల నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. గతంలో ఇరిగేషన్ అధికారులు హామీ ఇచ్చినా పనులు ప్రారంభం కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రెండు చెరువులకు ప్రాజెక్టు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేకల పల్లవి అరవింద్ రెడ్డి, పొగాకు గట్టయ్య, కమ్మపాటి వెంకన్న, నూకల దశరథ, బోగారి రామలింగయ్య, కునుకుంట్ల రామచంద్రం, మోసంగి అంతయ్య, మామిడి స్వామి, మట్టపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి