Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / జహీరాబాద్

వేతనాలు లేవు.. ఉద్యోగ భద్రత లేదు.. జహీరాబాద్ ఆసుపత్రి కార్మికుల ఆవేదన!

Updated : 02 Nov 2026 20:41 IST
As Preferred Source 1 min read
వేతనాలు లేవు.. ఉద్యోగ భద్రత లేదు.. జహీరాబాద్ ఆసుపత్రి కార్మికుల ఆవేదన!

జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. 208 పడకల సామర్థ్యానికి అనుగుణంగా గతంలో నియమించిన కార్మికులను, ప్రస్తుతం 100 పడకల ఆధారంగానే వేతనాలు వస్తున్నాయనే కారణంతో తగ్గించేందుకు కాంట్రాక్టర్ ప్రయత్నిస్తున్నట్లు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి, ఆసుపత్రి యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎస్. మహిపాల్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఆసుపత్రిలో సిబ్బంది కొరతతో కార్మికులపై అధిక పనిభారం పడుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో మరికొంతమంది కార్మికులను తొలగించాలని చూడటం అన్యాయమని అన్నారు. ఒకవైపు కార్మికులతో అధికంగా పని చేయించుకుంటూ, మరోవైపు ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. అంతేకాకుండా సెప్టెంబర్ నెల వేతనాలు కూడా చెల్లించకపోవడంతో కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ సమస్యపై సీఐటీయూ నాయకులు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్ఎస్) శ్రీధర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గత అనేక సంవత్సరాలుగా ఆసుపత్రిలో సేవలందిస్తున్న కార్మికులందరినీ యథావిధిగా కొనసాగించాలని మహిపాల్ డిమాండ్ చేశారు. కార్మికులను తొలగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సీఐటీయూ నాయకుల విజ్ఞప్తిపై స్పందించిన డీసీహెచ్ఎస్ శ్రీధర్ ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎలీషా, నాయకులు గోపాల్, వసీం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వేతనాలు లేవు.. ఉద్యోగ భద్రత లేదు.. జహీరాబాద్ ఆసుపత్రి కార్మికుల ఆవేదన!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి