సదాశివపేటలోని శివరాజ్ పాటిల్ నివాసంలో జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ను సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ పెద్దలు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ, దసరా పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు,ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నింపాలని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ప్రతి ఒక్కరికీ విజయాలను అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శివ చందర్ కుమార్ పాటిల్, గందిగా రాజు, అనిమిశెట్టి జయప్రకాశ్, వీర మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
దసరా పర్వదినాన బీబీ పాటిల్‌ను కలిసిన వీరశైవ లింగాయత్ పెద్దలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి