కేసులు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి.. కుమార్తెను చంపుతానంటూ హెచ్చరికలు.
రామన్నపేట: మహిళను మోసం చేసి 12 ఏళ్లుగా శారీరక సంబంధం కొనసాగించడంతో పాటు, కేసులు ఉపసంహరించుకోవాలని బెదిరించిన ఆరోపణలపై రామన్నపేట మండలానికి చెందిన ముక్కామల దుర్గయ్య (49)ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిపై చర్యలు తీసుకున్నట్లు రామన్నపేట ఎస్సై సతీష్ తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. దుర్గయ్య తన భార్య చనిపోయిందని, తనకు ఎవరూ లేరని ఓ మహిళను నమ్మించి గత 12 ఏళ్లుగా ఆమెతో శారీరక సంబంధం కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చగా, ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించినట్లు ఆరోపణలు రావడంతో అతనిపై అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో ఉండగానే దుర్గయ్య భార్య బతికే ఉందని, అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని బాధితురాలికి తెలియడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం.కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు
తనపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని దుర్గయ్య ఫోన్ ద్వారా బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన సెల్ఫోన్లో ఉన్న బాధితురాలి నగ్న చిత్రాలను ఇతరులకు చూపించి ఆమె పరువు తీస్తానని, ఆమె కుమార్తెను చంపుతానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి