అమ్మవారి సేవలో ఎరుకల సంధ్య రాందాస్ గౌడ్
చిన్నకొండూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దాతల సహకారంతో భక్తులకు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు.ఉత్సవాల సందర్భంగా ఎరుకల సంధ్య రాందాస్ గౌడ్ ప్రతిరోజూ అమ్మవారికి చీరలు, పూజా సామగ్రిని సమర్పిస్తూ ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య దేవాలయానికి అమ్మవారి విగ్రహాన్ని దానంగా అందజేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎరుకల రాందాస్ గౌడ్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు, ఆధ్యాత్మిక పూజలు వైభవంగా జరుగుతున్నాయి.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డం సత్తయ్య, వార్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి