రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణకారుల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు తోగిటి మురళి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాల ఆవరణలో ఈనెల 24వ తేదీన హైదరాబాద్లో సరూర్నగర్ గ్రౌండ్ జరిగె స్వర్ణకార శంఖారావం భారీ బహిరంగ సభ వాల్ పోస్టర్లు కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో స్వరాష్ట్ర ఉద్యమంలో విశ్వబ్రాహ్మణ పాత్ర గణనీయమైందని గుర్తు చేశారు. మళ్లీ దశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్ చారి బలిదానంతో పాటు 22 మందికి పైగా విశ్వబ్రాహ్మణులు ప్రాంతం చేశారని బంగారు తెలంగాణలో సమిదలుగా గా మారారు అన్నారు. రాష్ట్రం వచ్చిన విశ్వబ్రాహ్మణులకు జరిగిన మేలు ఏమి లేదన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు కార్పొరేట్ కంపెనీలు జువెలరీ షాపులు ఏర్పాటుచేసి స్వర్ణకారులను చేతివృత్తులను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 సంవత్సరాలు నిండిన స్వర్ణకార వృత్తిదారులకు నెలకు 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, అన్ని బ్యాంకుల అప్రైజరలకు సీలింగ్ విధానం తొలగించి సమాధానం కమిషన్ ఇవ్వాలని, జీవో నెంబర్ 272 సవరణ చేసి అక్రమ రికవరీలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం సలహాదారుడు నారాయణదాసు రామాచారి, జిల్లా కోశాధికారి బాణాల శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు ఆకారపు పరిపూర్ణ జనరల్ సెక్రెటరీ నారాయణదాసు నరసింహ చారి, అమరావతి దామోదర్ చారి, అనుముల బ్రహ్మచారి సురేష్ నాగేంద్ర చారి,గోపి,ఉల్లి సుధాకర్, రాంబాబు నరసింహాచారి భాస్కరాచారి వీరాచారి కృష్ణమాచారి సాయి పాల్గొన్నారు
స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి