పుట్టినరోజున హెల్మెట్, మొక్క బహుకరణ.
చిన్నకాపర్తి: పుట్టినరోజు వేడుకల్లో కేకులు, పూలదండలకు బదులుగా పర్యావరణ పరిరక్షణ, రహదారి భద్రతకు ప్రాధాన్యమిస్తూ వినూత్నంగా వేడుకలు నిర్వహించారు చిన్నకాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్. సామాజిక కార్యకర్త పొలిమేర దశరథ పుట్టినరోజు సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, సురక్షిత ప్రయాణానికి ప్రతీకగా హెల్మెట్‌తో పాటు పర్యావరణ పరిరక్షణకు మొక్కను బహుకరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. పుట్టినరోజు వేడుకలను సామాజిక ప్రయోజనంతో నిర్వహించడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు దేశపాక మధు, పెర్కా నాగరాజు, నాయకులు వలిగొండ సత్యనారాయణ, పల్లపు ప్రశాంత్, మాజీ వార్డు సభ్యుడు హెచ్చు స్వామి, బీజేపీ నాయకులు పొలిమేర నర్సింహా, కాంగ్రెస్ నాయకులు అన్నెపు కార్తీక్, మెట్టు శివ తదితరులు పాల్గొని దశరథకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి