అనాథాశ్రమంలో అన్నదానం.. రోగులకు పండ్ల పంపిణీ
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పబ్బు అరుణ-రాజు గౌడ్ దంపతుల 29వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్ పట్టణంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.పిఏసిఎస్ ఛైర్మన్ మస్తాన్ బాబు యాదవ్ ఆధ్వర్యంలో పట్టణంలోని 'అమ్మానాన్న' అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టి ఆశ్రమవాసులకు భోజనాలు వడ్డించారు. అనంతరం చౌటుప్పల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ భార్గవ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పబ్బు అరుణ-రాజు గౌడ్ దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోషిక వినయ్ కుమార్, పిఏసిఎస్ వైస్ ఛైర్మన్ పర్నె శివారెడ్డి, కౌన్సిలర్లు పాక చిరంజీవి, పిల్లలమర్రి మధుసూదన్, చింతల ఉమామహేశ్వరి సాయిలు, ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, సుర్వి నర్సింహ గౌడ్, కో-ఆప్షన్ సభ్యులు సందగళ్ల విజయ సతీష్ గౌడ్, గంగపురం నగేష్ గౌడ్, నాయకులు బోయ వెంకట్, ప్రస్తం గంగారాములు, కంచర్ల అశ్విన్ కుమార్ రెడ్డి, బొబ్బిళ్ల రాజేందర్, వర్కాల వెంకట్ కుమార్ గౌడ్, తోర్పునూరి నర్సింహ గౌడ్, బోడిగే బాలకృష్ణ గౌడ్, వర్కాల రవి గౌడ్, నందగిరి పరమేష్ గౌడ్, పెద్దగోని రమేష్ గౌడ్, దేప శ్యామ్, బుర్ర శివకుమార్ గౌడ్, దుబ్బాక ఆకాష్ రెడ్డి, చెవగొని వెంకటేష్ గౌడ్, చింతకింది గణేష్ గౌడ్, సుర్వి మహేష్ గౌడ్, తోర్పునూరి లింగస్వామి గౌడ్, సందగళ్ల కిరణ్ గౌడ్, వహీద్ భాయ్, బండమీది ఎల్లయ్య, ఉష్కగుల శ్రీశైలం గౌడ్, మామిడి శివకుమార్ గౌడ్, ఆవుల రాజు యాదవ్, గుండు రాజు గౌడ్, వెంకట్ గౌడ్, మహంకాళి పృథ్వీ, బక్క సాయి, బాతరాజు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి