భారతీయ హిందూ పరిషత్ అంతర్జాతీయ సంస్థ తెలంగాణ రాష్ట్ర శాఖ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా మెదక్ భాగ్యరేఖ నియమితులయ్యారు. సంస్థ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు నేషనల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోల శివరామకృష్ణ ఆమోదంతో ఆమె నియామకాన్ని ఖరారు చేశారు. మెదక్ భాగ్యరేఖ ధార్మిక, సాంస్కృతిక రంగాల్లో సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ముఖ్యంగా కూచిపూడి, ఆంధ్రనాట్యం, భరతనాట్యం వంటి నృత్యకళల్లో చిన్నారులకు శిక్షణ ఇస్తూ భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు.నృత్య ప్రదర్శనల ద్వారా దేవతామహాత్మ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు, సనాతన ధర్మ విలువలను పిల్లలకు పరిచయం చేస్తూ వారిలో భక్తిభావం, ధార్మిక చైతన్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా భాగ్యరేఖ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించిన జాతీయ నాయకత్వానికి, నేషనల్ సెక్రటరీకి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోల శివరామకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ఆశయాలకు అనుగుణంగా సంగారెడ్డి జిల్లాలో సనాతన ధర్మ పరిరక్షణ, దేవాలయాల పర్యవేక్షణ, గోసంరక్షణ, గోసేవ, మహిళా సాధికారత, యువతలో ధార్మిక చైతన్యం పెంపొందించడం,బాలబాలికలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపడతానని పేర్కొన్నారు. జిల్లాలోని హిందూ బంధువులు,ధార్మిక సంస్థలు, కళాకారులు, యువత, మహిళలను సమన్వయం చేసుకుంటూ భారతీయ హిందూ పరిషత్ సంస్థను జిల్లాలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.
భారతీయ హిందూ పరిషత్ జిల్లా బాధ్యతలు స్వీకరించనున్న భాగ్యరేఖ
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి