మునగాల మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన కుంచం సందీప్ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గ్రామంలోని విద్యార్థులకు నోటుబుక్స్, పెన్నులు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ మాజీ సర్పంచ్ నందిపాటి వెంకయ్య మాట్లాడుతూ.. పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు దూరంగా నిర్వహిస్తూ విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను అందించడం అభినందనీయమన్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నత ఉద్యోగంలో కొనసాగుతున్నప్పటికీ సొంత గ్రామంపై మమకారంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో పుట్టినరోజుల పేరుతో అనవసర ఖర్చులు చేయకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలని యువతకు సూచించారు. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి అందించడం ద్వారా వారి చదువుకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సోమపంగు రేణుక, గణేష్, ఉబ్బపల్లి నాగమణి, అంగన్వాడీ టీచర్ నందిపాటి సృజనారాణి, గ్రామ యువకులు బొంత సిద్ధు, రెడ్డిగడ్డం శివ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల చదువుకు ప్రోత్సాహంగా సందీప్ సేవా కార్యక్రమం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి