Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు సముచిత న్యాయం

Updated : 17 Nov 2026 19:03 IST
As Preferred Source 1 min read
కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు సముచిత న్యాయం

నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేసిన సర్పంచ్ జువ్వి నరసింహ

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరుగుతుందని ధర్మోజి గూడెం గ్రామ సర్పంచ్ జువ్వి నరసింహ పేర్కొన్నారు. మంగళవారం గ్రామంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను ఆయన లబ్ధిదారులకు అందజేశారు.​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ బత్తుల శ్రీహరి, వార్డు సభ్యులు ఊదరి శ్రీనివాస్, రాచకొండ భార్గవ్, మాజీ సర్పంచ్ బద్రి లింగయ్య, మాజీ ఉపసర్పంచ్ కొంతం బుచ్చి రెడ్డి, చేన్నోజు విజయాచారి, యువజన కాంగ్రెస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు డాకోజి సతీష్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు సముచిత న్యాయం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి