రెండో సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య.. నల్లగొండలో కలకలం.
నల్లగొండ: పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి గండికోట జగదీష్ ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. హాస్టల్ గదిలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.మృతుడు రంగారెడ్డి జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన గండికోట జగదీష్‌గా గుర్తించారు. ఘటనను గమనించిన కళాశాల సిబ్బంది, సంబంధిత అధికారులు మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.
విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. విద్యార్థి మృతితో కళాశాల హాస్టల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి