మునగాల మండలం మాధవరం గ్రామ శివారులో సోమవారం జాతీయ రహదారి-65 డివైడర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అక్కడ నాటిన మొక్కలు, చెట్లు మంటల్లో కాలిపోయాయి. మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఏఎస్ఐ డి.వెంకటరత్నం, హెడ్ కానిస్టేబుల్ బుడిగం లక్ష్మణ్, కానిస్టేబుల్ తండు సతీశ్ ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీంతో మంటలు మరింత విస్తరించకుండా అడ్డుకట్ట పడింది. సకాలంలో స్పందించి ప్రమాద తీవ్రతను తగ్గించిన పోలీసులను స్థానికులు అభినందించారు.
డివైడర్‌పై మంటలు.. సకాలంలో స్పందించిన పోలీసులు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి