Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

తాడ్వాయిలో 52 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

Updated : 16 Nov 2026 20:46 IST
As Preferred Source 1 min read
తాడ్వాయిలో 52 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మునగాల మండలం తాడ్వాయి గ్రామ సర్పంచ్ కొలిశెట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య అన్నారు. సోమవారం తాడ్వాయి గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను 52 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలతో పోలిస్తే తమ గ్రామానికి 52 పింఛన్లు మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామంలో రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామానాయక్, వార్డు సభ్యులు, సొసైటీ డైరెక్టర్ గట్టు ఉపేందర్‌రావు, మాజీ సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్థులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Sthanikam

తాడ్వాయిలో 52 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి