Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

కార్తీక సోమవారం వేడుకలు.. చెరువుగట్టు శివాలయంలో రుద్రహోమం

Updated : 16 Nov 2026 20:45 IST
As Preferred Source 1 min read
కార్తీక సోమవారం వేడుకలు.. చెరువుగట్టు శివాలయంలో రుద్రహోమం

మునగాల మండల కేంద్రంలోని చెరువుగట్టు శివాలయం కార్తీక సోమవారం సందర్భంగా భక్తులతో సందడిగా మారింది. ఆలయ అర్చకులు వారణాసి కిషోర్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి, నవగ్రహ, దుర్గాసూక్త సహిత రుద్రహోమాన్ని వేదమంత్రాల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసంలో శివారాధన, దీపారాధన, హోమాలకు విశేష ప్రాధాన్యత ఉందని తెలిపారు. దైవచింతనతో మనశ్శాంతి, ఆధ్యాత్మిక భావన పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వారణాసి కిషోర్ లక్ష్మీ, కాసర్ల సీతయ్య రత్నకుమారి, గుండు నాగేశ్వరరావు విజయలక్ష్మి దంపతులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

కార్తీక సోమవారం వేడుకలు.. చెరువుగట్టు శివాలయంలో రుద్రహోమం

Article Image

మునగాల మండల కేంద్రంలోని చెరువుగట్టు శివాలయం కార్తీక సోమవారం సందర్భంగా భక్తులతో సందడిగా మారింది. ఆలయ అర్చకులు వారణాసి కిషోర్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి, నవగ్రహ, దుర్గాసూక్త సహిత రుద్రహోమాన్ని వేదమంత్రాల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసంలో శివారాధన, దీపారాధన, హోమాలకు విశేష ప్రాధాన్యత ఉందని తెలిపారు. దైవచింతనతో మనశ్శాంతి, ఆధ్యాత్మిక భావన పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వారణాసి కిషోర్ లక్ష్మీ, కాసర్ల సీతయ్య రత్నకుమారి, గుండు నాగేశ్వరరావు విజయలక్ష్మి దంపతులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి