ఎరువుల దుకాణం వ్యాపారం సజావుగా కొనసాగేందుకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా చూస్తానని చెప్పి రూ.30 వేల లంచం డిమాండ్ చేసిన సదాశివపేట మండల వ్యవసాయ అధికారి జి. రమేష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మంగళవారం తన కార్యాలయంలో మిగిలిన రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి అల్లుడు నిర్వహిస్తున్న ఎరువుల దుకాణానికి సంబంధించి అధికారి లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గత అక్టోబర్ 19న ముందస్తుగా రూ.10 వేలు తీసుకోగా, మిగిలిన రూ.20 వేలు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ విధులను దుర్వినియోగం చేస్తూ లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై జి. రమేష్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని రెండో అదనపు ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
లంచం తీసుకుంటూ కార్యాలయంలోనే పట్టుబడ్డ వ్యవసాయ అధికారి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి