రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల శివారులో ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. భువనగిరి నుంచి చిట్యాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (నంబర్ TS 30 T 1166) సడన్ బ్రేక్ వేయడంతో ఎడమవైపునకు జారిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న సుమారు 23 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న రామన్నపేట పోలీసు సిబ్బంది డి. స్వామి నాయక్, మధు, హోంగార్డు సీహెచ్ స్వామి అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి