హాక్ ఐ యాప్ ప్రారంభం.. 71,045 మంది సిబ్బంది వివరాల సేకరణ.
సరోూర్‌నగర్, అక్టోబర్ 27: నివాస ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేసి, నేరాల నియంత్రణకు ప్రజలను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ‘మీ సురక్షా 2.0 – హాక్ ఐ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు.
కమిషనరేట్ పరిధిలో 4,06,318 నివాస ప్రాంతాలు, సంస్థల క్లస్టర్లను సర్వే చేయగా, 71,045 మంది గృహ సహాయకులు, ఇతర సేవా సిబ్బంది వివరాలను సేకరించారు. ప్రజలు తమ ఇళ్లలో పనిచేసే సిబ్బంది వివరాలను హాక్ ఐ యాప్‌లో నమోదు చేయాలని కమిషనర్ సూచించారు. ఆర్‌డబ్ల్యూఏలు, హాస్టళ్లు, వ్యాపార సంస్థలు పోలీసులతో సమన్వయం చేసుకొని సురక్షిత సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.
వెబ్‌సైట్: https://malkajgiripolice.telangana.gov.in/
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి