పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా కోదాడ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంగళవారం డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ఎంతో విలువైనదని, ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకొని, స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు.ఈ రక్తదాన శిబిరంలో సీఐలు శివశంకర్, రామకృష్ణారెడ్డి, చరమందరాజు తదితర పోలీస్ అధికారులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. పోలీస్ సిబ్బందితో పాటు యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమం సమాజానికి సేవ చేయాలనే స్ఫూర్తిని చాటింది.రక్తదానం చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు, ప్రమాద బాధితులకు, ఇతర వైద్య అవసరాలు ఉన్నవారికి ప్రాణదానం చేసినట్లవుతుందని నిర్వాహకులు తెలిపారు.రక్తదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడంతో పాటు, ఆపదలో ఉన్నవారికి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా రక్తదానం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ, సేవా భావంతో ముందుకు రావాలని యువతకు పిలుపునిచ్చారు.
సేవా స్ఫూర్తితో కోదాడ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి