దళారులను నమ్మి మోసపోవద్దు
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకొని నష్టపోవద్దని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు.చౌటుప్పల్ మండల పరిధిలోని చిన్నకొండూరు, పెద్దకొండూరు, మసీదుగూడెం, గుండ్లబావి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం క్వింటాలు ధాన్యానికి మద్దతు ధర రూ.2,416గా నిర్ణయించిందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదును కేవలం మూడు రోజుల్లోనే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున, రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ మస్తాన్ బాబు,ఏపీఎం యాదయ్య, సర్పంచ్‌లు తిగుళ్ళ చంద్రయ్య, మర్రి వంశీధర్ రెడ్డి, గుండెబోయిన శిరీష ఇస్తారీ, నందగిరీ వెంకటేశం, ఉపసర్పంచ్ లు గడ్డం సత్తయ్య, పిన్నింటి శ్రీనివాస్ రెడ్డి,పల్చం జయమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాటేపల్లి నవీన్ గౌడ్, మర్రి రాజి రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు నల్ల నరేందర్ రెడ్డి, బొబ్బిల్ల రాజేందర్, జక్కిడి వెంకట్ రెడ్డి, ఏ ఈ ఓ లు సోనీ, వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు శ్రీశైలం, ధనలక్ష్మి, నాయకులు బక్క శ్రీనాథ్, బక్క మల్లయ్య, తిగుళ్ళ పెంటయ్య వాకిటి భూపాల్ రెడ్డి, మర్రి శ్యామ్ సుందర్ రెడ్డి,గూడూరు థాను రెడ్డి, గూడూరు నవీన్ రెడ్డి, గుండెబోయిన ఐలయ్య, ముప్పిడి శ్రీనివాస్,నందిగిరి పరమేశ, భీమిడి మల్లారెడ్డి, పల్లె వెంకటేష్, తిగుళ్ళ బాలరాజు, పల్చం సాయి, ఉదరీ రమేష్, శివ, మహిళా సంఘాల నాయకురాళ్ళు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి