భువనగిరి, (స్థానికం): విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని భువనగిరి పట్టణ సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. డ్రగ్స్ బారిన పడి విలువైన జీవితాన్ని, కెరీర్‌ను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
భువనగిరి పట్టణంలోని టైమ్స్ కాలేజీ ఆధ్వర్యంలో సుమంగళి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఫ్రెషర్స్, ఫేర్‌వెల్ పార్టీకి సీఐ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి దశ ఎంతో కీలకమని, ఈ సమయంలో మంచి అలవాట్లు అలవర్చుకొని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. చెడు స్నేహాలకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాలేజీ కరస్పాండెంట్ అవినాష్‌రాయ్, ప్రిన్సిపాల్ వెంకన్న, రఫీక్, సత్యనారాయణ, గణేష్, ప్రదీప్, శిరీష, రమేష్, మారుతి, చంద్రశేఖర్, నిషిత, నికిత, సుమ, ప్రతిభ, అంజి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి