Sthanikam - Truth Matters
Logo

పారిశుధ్య కార్మికులకు దసరా కానుక.. ఘనంగా అలాయ్‌–బలాయ్‌ వేడుకలు

Updated : 18 Oct 2026 17:09 IST
As Preferred Source 1 min read
పారిశుధ్య కార్మికులకు దసరా కానుక.. ఘనంగా అలాయ్‌–బలాయ్‌ వేడుకలు

45 మంది మున్సిపల్ కార్మికులకు సన్మానం.. రూ.22,500 నగదు పంపిణీ.

ప్రతి కార్మికుడికి రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తా: కూనూరు సంజయ్‌ దాస్‌ గౌడ్‌

చిట్యాల: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ నేత కూనూరు సంజయ్‌ దాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో చిట్యాలలో ‘దసరా అలాయ్‌–బలాయ్‌’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వరుసగా మూడో ఏడాది నిర్వహించిన ఈ వేడుకల్లో పట్టణ పారిశుధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న 45 మంది మున్సిపల్‌ కార్మికులను శాలువాలతో సత్కరించి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కార్మికులకు కొత్త బట్టలు కొనుగోలు చేసుకునేందుకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున మొత్తం రూ.22,500 నగదును అందజేశారు. నిత్యం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమిస్తున్న కార్మికుల సేవలను గుర్తించి, వారితో కలిసి పండుగను జరుపుకోవడం కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది.

కార్మికుల సేవలు వెలకట్టలేనివి

ఈ సందర్భంగా సంజయ్‌ దాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రజలు తమ ఇళ్లలో పండుగలను ఆనందంగా జరుపుకుంటున్నారంటే అందుకు పారిశుధ్య కార్మికుల శ్రమ కూడా ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఎండా, వానను లెక్కచేయకుండా పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం పనిచేసే కార్మికుల సేవలను సమాజం గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులను సన్మానించడం కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, వారి పట్ల తమకున్న గౌరవం, ఆత్మీయతకు నిదర్శనమని తెలిపారు.

ప్రతి కార్మికుడికి రూ.5 లక్షల ప్రమాద బీమా

మున్సిపల్‌ కార్మికుల సంక్షేమానికి తమ సంఘం కట్టుబడి ఉందని సంజయ్‌ దాస్‌ గౌడ్‌ తెలిపారు. సంఘం తరఫున ప్రతి మున్సిపల్‌ కార్మికుడికి రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. ఈ ప్రకటనపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మిక నాయకులు పాల లక్ష్మయ్య, రుద్రవరం ఇస్తారీ, గుండె దుర్గయ్య, దొడ్డి బిక్ష్మయ్య, జనపాల జ్యోతి, పులిగిల్ల పద్మ, బాకీ అండాలు, పోకల లావణ్యతో పాటు తెలంగాణ ఉద్యమకారులు, సంఘం నాయకులు, పలువురు కార్మికులు పాల్గొన్నారు.

Sthanikam

పారిశుధ్య కార్మికులకు దసరా కానుక.. ఘనంగా అలాయ్‌–బలాయ్‌ వేడుకలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి