తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ మండలంలో ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని ప్రియాంక కాలనీలో ఉన్న ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, కోలాటాలు, ఆటపాటలతో సందడి చేశారు.బతుకమ్మ పాటలు పాడుతూ గౌరమ్మకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని,ప్రకృతిపై ప్రేమను చాటిచెప్పే బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది.చివరి రోజైన సద్దుల బతుకమ్మ సందర్భంగా ఐదు రకాల సద్దులను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఉంది.అందుకే ఈ పండుగకు సద్దుల బతుకమ్మ అనే పేరు వచ్చింది. తంగేడు, గునుగు తదితర ప్రకృతి సిద్ధమైన పూలతో బతుకమ్మలను అలంకరించి మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.అనంతరం బతుకమ్మలను సమీపంలోని చెరువులు, కుంటల వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తూ, వచ్చే ఏడాది మళ్లీ రావాలని గౌరమ్మకు వీడ్కోలు పలికారు. నిమజ్జనం అనంతరం నైవేద్యాలను కుటుంబ సభ్యులు,బంధువులు,స్నేహితులతో పంచుకున్నారు.ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని,మహిళల ఐక్యతను చాటిచెప్పాయి. ప్రియాంక కాలనీకి చెందిన పెద్దలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
పూల పండుగ బతుకమ్మ.. పెద్ద శంకరంపేట్లో పండుగ సందడి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి